వర్మ ‘మర్డర్’ మూవీ..అమృత ప్రణయ్ ఫస్ట్ లుక్

205
rgv murder
- Advertisement -

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కథను తెరకెక్కిస్తున్నాడు. సూర్యపేటకు చెందిన అమృత ప్రణయ్ ల లవ్ స్టోరీ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈమూవీ సంచలనంగా మారింది. ఈసినిమాకు సంబంధించిన ఇటివలే ఓ పోస్టర్ ను విడుదల చేశాడు దర్శకుడు వర్మ. మర్డర్ అనే టైటిల్ తో ఈమూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాలోని మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేపేలా వర్మ పోస్టర్లు విడుదల చేస్తున్నారు.

ఈపోస్టర్లో అమృత తన కుమారుడిని ఎత్తుకుని ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమూవీలో అమృత పేరు అవంచసాహితి అని తెలుస్తుంది. కాగా అమృత భర్త ప్రణయ్ ను చంపిన మారుతీరావు ఇటివలే సూసైడ్ చేసుకుని మరణించాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ చంద్రా డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఈమూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు వర్మ.

- Advertisement -