రాష్ట్ర సర్వీసుకు ఐఏఎస్ ఆమ్రపాలి

104
- Advertisement -

తిరిగి రాష్ట్ర సర్వీసుకు ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి బదిలీ అయ్యారు. కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు ఆమ్రపాలి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమ్రపాలి కాటా కలిశారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారామె. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడే డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు.

2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా , అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ పనిచేశారు. 2018 ఫిబ్రవరిలో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను వివాహం చేసుకున్నారు ఆమ్రపాలి.

Also Read:మహిళలల్లో మధుమేహం..చాలా ప్రమాదం!

- Advertisement -