Bigg Boss 7 Telugu:అమర్‌,అర్జున్‌ జర్నీ వీడియో సూపర్బ్

38
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 99 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా అమర్ దీప్, అర్జున్ ఇద్దరి బిగ్ బాస్ జర్నీని చూపించారు. ముందుగా అమర్‌కి సర్‌ప్రైజ్ ఇస్తూ మీరు మాత్రమే గార్డెన్ ఏరియాకి రావాలని అనౌన్స్‌చేశారు బిగ్ బాస్. అమర్ తలుపు తీసి చూసేసరికి గార్డెన్ ఏరియా మొత్తం మరో ప్రపంచంలా ఉంది. అక్కడ ఉన్న తన ఫొటో గ్యాలరీ, బుక్ ఆఫ్ మెమొరీస్‌ను చూసి అవాక్కయ్యాడు.

అక్కడ ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్ చూసి థాంక్యూ బిగ్‌బాస్, నాగార్జున సార్.. నా కోరిక తీర్చారు కెప్టెన్ చేసి అంటూ చెప్పుకొచ్చాడు. మా పెళ్లిలో కూడా నాకు ఇలాంటి ఫొటోస్ లేవు బిగ్‌బాస్.. థాంక్యూ సోమచ్.. అంటూ మురిసిపోయాడు. తర్వాత యాక్టివిటీ ఏరియాకి రండి అంటూ బిగ్‌బాస్ పిలిచాడు. ఇక అక్కడ మరో సెటప్ చేశాడు బిగ్‌బాస్. అమర్‌దీప్.. మీ పేరుకి అర్థం ఎప్పటికీ వెలిగే జ్యోతి.. అదే విషయం మీ ప్రయాణంలో ప్రతిబింబించిందని తెలిపారు. అమర్ జర్నీ వీడియోను ఎదురుగా ఉంచిన స్క్రీన్‌పై ప్లే చేయగా అది అద్భుతంగా ఉంది. థాంక్యూ సో మచ్ బిగ్‌బాస్.. థ్యాంక్యూ ఆడియన్స్.. అంటూ మోకాళ్ల మీద కూర్చొని చెప్పాడు అమర్.

తర్వాత అర్జున్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలోకి అర్జున్ ఎంట్రీ ఇస్తుండగా ‘వీడు ఆరడుగుల బుల్లెట్’ అంటూ సాంగ్ ప్లే చేశాడు. తన జర్నీ ఫొటోలు చూసి అర్జున్‌ ఫిదా అయి పోయాడు. ఆల్బమ్ ఓపెన్ చేయగానే అందులో తన భార్య హౌస్‌లోకి వచ్చిన ఫొటోలు చూసి ఎమోషనల్ అయ్యాడు. తర్వాత యాక్టివిటీ ఏరియాకి పిలిచి తన జర్నీ వీడియో ప్లే చేసేముందు అర్జున్ గురించి నాలుగు మాటలు చెప్పి మరింత జోష్ నింపాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అర్జున్ వచ్చిన క్షణాల నుంచి ఫినాలే అస్త్రం గెలిచినంత వరకూ అర్జున్ జర్నీని చాలా అద్భుతంగా కట్ చేశారు.

Also Read:మంగళ,శుక్రవారాల్లో ప్రజావాణి

- Advertisement -