తెలంగాణ బీజేపీలో గత కొన్నాళ్లుగా అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలు గట్టిగా వినిపిస్తూ వచ్చాయి. మరి ముఖ్యంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భట్టుమనేలా విభేదాలు ఉన్నాయనే టాక్ నడిచింది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇంతవరకు ఈ ఇద్దరు అధికారిక పార్టీ కార్యకలపాలలో పాల్గొన్న సందర్భాలు తక్కువే. పైగా ఆ మధ్య ఈటెల చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశం అవుతూ వచ్చాయి. తనను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఈటెల చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు బండి సంజయ్ ని ఉద్దేశించే అనే చర్చ జరిగింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగానే తెలంగాణ బీజేపీ ఘోరంగా ఓటమి చవిచూసిందనే భావన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తూ వచ్చింది. .
ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి వచ్చి పార్టీ పరిస్థితులను కొంత చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని, విభేదాలను పక్కన పెట్టాలని గట్టిగా చురకలంటించారట. ముఖ్యంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు ఒకే తాటిపై ఉండాలని గట్టిగానే సూచించారట. అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ పార్టీలో గట్టిగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. తాజాగా బండి సంజయ్ ఈటెల గురించి మాట్లాడుతూ ” తనకు ఈటెల రాజేందర్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ” క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వీరిద్దరి మద్య అంతర్గతంగా కోల్డ్ వార్ జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. మరి అసెంబ్లీ ఎన్నికల ముందు ఎడమొఖం పెడమొఖంగా ఉన్న ఈ ఇద్దరు.. లోక్ సభ ఎన్నికల వేళ నైనా కలిసి నడుస్తారేమో చూడాలి.
Also Read:సైంధవ్..వెంకీ ఇమేజ్‌కు తగ్గట్టుగా!