- Advertisement -
బీజేపీ అగ్రనేత,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. మార్చి 12 న రాష్ట్రంలో పర్యటించనున్నారు షా. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్లు బిజేపీ నేతలు తెలిపారు.
ఇక షా పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేశారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన సాగనుంది. నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చలు జరగడంతో బీజేపీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై నేతల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు అమిత్ షా.
ఇవి కూడా చదవండి..
- Advertisement -