అగ్రనేతల పోటాపోటి టూర్స్..!

43
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఇరు పార్టీల జాతీయ నేతలు తెలంగాణపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కాస్త సమయం దొరికిన ఛలో తెలంగాణ అంటూ ఆసక్తి పెంచుతున్నారు. ఈ నెలాకరునా బీజేపీ మరియు కాంగ్రెస్ జాతీయ నేతలు పోటాపోటిగా తెలంగాణకు రానున్నారు. .

ఈ నెల 29 న అమిత్ షా రానుండగా ఆ మరుసటి రోజే కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ రాష్ట్రనికి రానున్నారు. దీంతో రెండు పార్టీల హడావిడి మామూలుగా లేదు. ఈ మద్యనే రాష్ట్ర బీజేపీలో మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పింది ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం. అలాగే ఎప్పటి నుంచో పదవుల విషయంలో అసంతృప్తిగా ఉన్న ఈటెల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మెన్ హోదా ను కల్పించింది. ఇలా మార్పులు చోటు చేసుకున్నా తరువాత అమిత్ షా రాష్ట్రానికి వస్తుండడంతో నేతలకు ఆయన ఎలాంటి సూచనలు చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read:కాంగ్రెస్‌ను కూల్చేందుకు కుట్ర..?

అలాగే ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో తదుపరి వ్యూహాలపై కూడా అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇక ఆ మరుసటి రోజే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కొల్లాపూర్ లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. జూపల్లి కృష్ణరావుతో పాటు మరికొంత మంది నేతలను పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పనున్నారు. అలాగే మహిళా డిక్లరేషన్ తో పాటు మరో మూడు డిక్లరేషన్లను కూడా ఈ టూర్ లో ప్రియాంకా గాంధీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ మరియు బీజేపీ అగ్రనేతల పోటాపోటి టూర్లతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

Also Read:సలార్ దరిదాపుల్లో లేని కల్కి..?

- Advertisement -