ఆపరేషన్ సిందూర్..శత్రువులకు హెచ్చరిక!

5
- Advertisement -

‘ఆపరేషన్ సిందూర్’ వార్షికోత్సవం సందర్భంగా దేశ రక్షణ వ్యవస్థ యొక్క పరాక్రమాన్ని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారత దేశంపై కన్నెత్తి చూసే శత్రువులకు, మన దేశం యొక్క తిరుగులేని దాడి సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ ఎల్లప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదని, భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే ఏ శక్తినైనా అణచివేయగల మన సామర్థ్యానికి ఇది నిదర్శనమని షా పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయదని, భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దులను కాపాడటంలో మన దళాలు ప్రదర్శిస్తున్న నిబద్ధత గర్వకారణమని అన్నారు.మే 7న ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం తన వ్యూహాత్మక బలాన్ని నిరూపించుకోవడమే కాకుండా, విదేశీ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని అమిత్ షా తెలిపారు.

Also Read:Modi:యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది

- Advertisement -