దక్షిణాదికే మేలు..పెరిగే సీట్ల సంఖ్య ఎంతో తెలుసా!

8
- Advertisement -

నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ప్రచారాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, పునర్విభజన తర్వాత దక్షిణాది రాష్ట్రాల బలం తగ్గడమే కాదు, మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు.దక్షిణాది రాష్ట్రాల సీట్ల వివరాలు (ప్రతిపాదిత):పునర్విభజన తర్వాత 850 సీట్లతో కూడిన కొత్త లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 129 నుండి 195కు పెరుగుతుందని అమిత్ షా వివరించారు.

పునర్విభజన తర్వాత కేరళ ఎంపీ సీట్ల సంఖ్య 20 నుండి 30కి చేరగా , తమిళనాడు ఎంపీ సీట్ల సంఖ్య 39 నుండి 59కి, కర్ణాటక 28 నుండి 42కి, తెలంగాణ సీట్ల సంఖ్య 17 నుండి 26కి చేరుతుందని షా వెల్లడించారు. మొత్తంగా దక్షిణాది సీట్ల సంఖ్య 129 నుండి 195కి చేరుతుందని వెల్లడించారు.

దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే అపోహలను సృష్టిస్తున్నారు. ప్రస్తుత 543 సీట్ల సభలో దక్షిణాది వాటా 23.76%. కొత్త సభలో ఈ వాటా స్వల్పంగా పెరిగి 23.97% అవుతుంది. కాబట్టి ఎవరికీ నష్టం లేదు అని షా వివరించారు. డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో తాము కనీసం ఒక కామా లేదా ఫుల్ స్టాప్ కూడా మార్చలేదని, పాత చట్టాన్నే యథాతథంగా అమలు చేస్తున్నామని ఆయన ప్రియాంక గాంధీకి సమాధానమిచ్చారు.

2029 ఎన్నికల వరకు పాత నియోజకవర్గాల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 292 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే 2/3 వంతు మెజారిటీ అవసరం కాగా, ప్రతిపక్ష కూటమి (232 సీట్లు) దీనిని వ్యతిరేకిస్తామని ప్రకటించింది.

Also Read:మన ఓటును కాపాడుకోవాలి: SIRపై కేటీఆర్

- Advertisement -