రాష్ట్రానికి అమిత్ షా..షెడ్యూల్ ఇదే

19
- Advertisement -

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు మద్యాహ్నం 1.05గంలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ కు 1.35కు చేరుకోనున్నారు అమిత్ షా. 1.50నుండి 2. 40వరకు సుదర్శన్ ఫంక్షన్ హాల్ లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశం కానున్నారు.

2.55కు మహబూబ్ నగర్ నుండి కరీంనగర్ బయలుదేరనున్నారు. 4 గంటలకు కరీంనగర్ చేరుకోనున్న అమిత్ షా…4.10నుండి 5గంటల వరకు క్లస్టర్ మీటింగ్ లో పాల్గొనున్నారు. కరీంనగర్ లోక్ సభతో పాటు, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్‌ పార్లమెంట్ కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 5గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరి 6గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయనికి చేరుకోనున్నారు.

6.15కు జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగే మహిళ సమ్మేళనం లో పాల్గొనున్నారు. దాదాపు 50 నిమిషాలపాటు మహిళ మేధావులు, వ్యాపార వేత్తలతో సమావేశం కానున్నారు. 7.45కు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా.

Also Read:Devara:’దేవర’ వాయిదా తప్పదా?

- Advertisement -