రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా కెనడా నుంచి తమ సొంత ఊరికి వచ్చిన నిజమాబాద్‌కు చెందిన అమిత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్ని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా కెనడా నుంచి తెచ్చిన అవకాడో సీడ్ మొక్కలు నాటిన అమిత్ బండారి దంపతులు.
ఈ సందర్భంగా అమిత్ దంపతులు మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి విని…కెనడాలోని మేము ఉండే యెల్లో నైఫ్ ప్రాంతంలో ప్రచారం కూడా నిర్వహించేవాళ్లమన్నారు. నన్ను కన్న నేల రుణం తీసుకోవాలనే దృఢ సంకల్పంతో మేం అవకాడో సీడ్‌ను నాటామని గుర్తు చేశారు.
కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ దొరక్క చాలా మంది ప్రాణాలు విడిచారని…అలాంటి సంఘటనలు జరగకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి ఇది ఒక గొప్ప అవకాశం అని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో తమ వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.