- Advertisement -
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కరోనాతో ఇప్పటికే బిగ్ బి అమితాబ్, అభిషేక్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఐశ్వర్యరాయ్,ఆరాధ్య హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
బిగ్ బీకి సంబంధించిన నాలుగు బంగ్లాలు జల్సా, జనక్, ప్రతీక్ష, వస్తాలని సీల్ చేసిన అధికారులు అక్కడ పూర్తిగా శానిటైజ్ చేశారు. అమితాబ్‌కి సంబంధించిన సిబ్బంది 26 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
26 మందికి కరోనా నెగటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అమితాబ్‌తో పాటు అభిషేక్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని వారికి సాధారణ వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
- Advertisement -