5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ రెండు భాగాల లైవ్-యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌గా, ఇప్పటివరకు రూపొందిన అతి పెద్ద టెంట్‌పోల్ సినిమాల స్థాయిని రీఇమాజిన్ చేయనుంది. ఈ చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అందుకున్న VFX స్టూడియో DNEG సంయుక్తంగా, యాష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న రామాయణ, IMAX కోసం చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రం పార్ట్ 1 – దీపావళి 2026లో, పార్ట్ 2 – దీపావళి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో యష్, సన్నీ డియోల్ లాంటి బిగ్ స్టార్స్ ఐకానిక్ పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తోంది. అయితే అది కేవలం తన వాయిస్ ఓవర్ ద్వారా మాత్రమే. ఇందుకు సంబంధించిన న్యూస్ టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.
Also Read:వీళ్లు సెలబ్రెటీలా…సజ్జనార్ ట్వీట్

