నగర నడిబొడ్డున కల్తీ కల్లు తో ఏడుగురు మరణించారు … ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రవణ్..సీఎం రేవంత్ దగ్గరే హోం శాఖ ఉంది, ఈ శాఖ భాద్యతారాహిత్యాన్ని బీ ఆర్ ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు.
పేదల ప్రాణాల పట్ల రేవంత్ కున్న శ్రద్ధ ఏమిటీ ?..పేదలు అంటే అంత చులకనా ?,రేవంత్ కు మానవత్వం లేదు …ఈ ఘటన పై ఇప్పటికీ సీఎం వైపు నుంచి స్పందన లేదు ..ఎక్సయిజ్ మంత్రి ఏం చేస్తున్నారు ? అన్నారు. డ్రగ్స్ ,గంజాయి కట్టడికి ఈగల్ అంటూ సీఎం డ్రామాలు ఆడుతున్నారు … ఆచరణలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అన్నారు.
కల్తీ కల్లు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించాలి… కల్తీ కల్లు కట్టడికి చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ కల్లు దుకాణాలు నడుపుతున్న వారు కాంగ్రెస్ నేతలనే సమాచారం ఉంది…వారు ఏ పార్టీ అని చూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. భవిష్యత్ లో ఒక్కరు కూడా కల్తీ కల్లు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి … ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ టీడీపీ నేత నారా లోకేష్ కు భారతీయ సాంస్కృతిక వైభవం పేరిట ఇచ్చిన చిత్రపటం లో తెలంగాణ మ్యాప్ లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
ఇది రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే…బీజేపీ,టీడీపీ లు తెలంగాణ ఏర్పాటు ను ఇంకా గుర్తించడం లేదా ? చెప్పాలన్నారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు .తెలంగాణ లేని చిత్రపటాన్ని బీజేపీ నేత ఇవ్వడం టీడీపీ నేత తీసుకోవడం నరనరాల్లో వారికి తెలంగాణ అంటే ఇష్టం లేని తీరును సూచిస్తోంది …మోడీ కూడా తెలంగాణ ఏర్పాటు గురించి తల్లి ని చంపి బిడ్డను వేరు చేశారని అన్నారు. సెక్షన్ 336 ,337 ల కింద డీజీపీ తక్షణమే సుమోటో గా కేసు నమోదు చేసి బీజేపీ టీడీపీ నేతల పై చర్యలు చేపట్టాలి అన్నారు.
తెలంగాణ లేని చిత్రపటం ఇవ్వడం అంటే అస్ధిత్వం పై దాడిగానే భావించాలి…బండి సంజయ్ ఈ వ్యవహారం పై ఎందుకు స్పందించరు ?, కేసీఆర్ ,కే టీ ఆర్ ల పై ఒంటి చేత్తో లెసే బండి సంజయ్ సంస్కృతి పై దాడిని ప్రశ్నించకపోతే తెలంగాణ వ్యతిరేకి గానే భావించాల్సి ఉంటుంది అన్నారు. టీడీపీ తెలంగాణ లో ఏదో వెలగబెడతామని అంటున్నారు .కనీసం తెలంగాణ ఉనికి ని గుర్తించకుండా ఇక్కడ రాజకీయం ఎలా చేస్తారు ..వెంటనే జరిగిన తప్పిదానికి టీడీపీ బీజేపీ లు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
Also Read:ఇదేనా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే!

