బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసులు నమోదు చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో సంచనల ట్వీట్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. యువత బంగారు భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలా? చెప్పాలన్నారు.
సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్ లకు యువతను బానిసలను చేసి వారి మరణాలకు కారణం అయ్యారు. మీరు బెట్టింగ్ కు ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి కన్న తల్లితండ్రులను చంపేస్తున్నారు… దొంగతనాలు చేస్తూ నేరాల బాట పడుతున్నారు అన్నారు.
బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన మీరు ఈ సమస్యలకు ప్రధాన కారకులు కాదా!? ఆలోచించండి… కాసులకు కక్కుర్తి పడి.. సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటు పోయినా పర్లేదనే మీ ధోరణి సరైంది కాదు అన్నారు.
Also Read:బెట్టింగ్ యాప్స్ కేసు..ఈడీ ఎంటర్!

