ధోనీ నుండి కోహ్లీ వరకు అందరికీ అమ్మాయిలే.. అమితాబ్ ఆసక్తికర ట్వీట్..!

180
dhoni
- Advertisement -

టీమిండియా క్రికెటర్లందరికీ ఆడపిల్లలు పుడుతున్నారు.దీంతో వారు ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ధోనీ నుండి మెుదలుకొని కోహ్లి వరకు అందరికి ఆడపిల్లలు పుట్టడడంతో సంతోషం కలిగిస్తోంది. ఇలా చాలా మంది క్రికెటర్ల ఇళ్ళలోకి లక్ష్మీ దేవతల్లా అడుగుపెట్టి ఆనందాన్ని నింపుతున్నారు.

తాజాగా ఈ విషయంపై బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ఓ ఫన్నీ ట్వీట్ అందరిలో ఆసక్తి కలిగించింది. కూతుళ్ళు పుట్టిన క్రికెట‌ర్లంద‌రి పేర్లను రాసుకుంటూ వెళ్లాడు. రైనా, గంభీర్‌, రోహిత్‌, ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేష్ యాద‌వ్‌ల పేర్లు వ‌రుస‌గా రాసుకొచ్చాడు. వారితో పాటు కోహ్లికి కూడా కూతురు పుట్టిందని.. ఇక భ‌విష్యత్‌లో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను పేర్కొన్నారు.

- Advertisement -