వ్యాక్సిన్ కోసం ఎవరూ తొందరపడొద్దు- మంత్రి

150
minister jagadish reddy
- Advertisement -

శనివారం సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్,జెడ్పీ చైర్ పర్సన్ దీపికా,గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ కిషోర్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్,ఆసుపత్రి సూపరిండెంట్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్‌-19 టీకా కోసం ఎవరూ తొందరపడొద్దని, ప్రాధాన్యక్రమంలో ప్రభుత్వం అందరికి టీకా అందిస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కరోనా ఫంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రభుత్వం తొలి విడుత టీకా ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. అనంతరం డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికుడు, కానిస్టేబుల్ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

- Advertisement -