కళ్యాణలక్ష్మీ పథకం..రూ.675 కోట్లు విడుదల

48
gangula

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “కళ్యాణలక్ష్మి పథకము’’ పై మంత్రి గంగుల కమలాకర్‌ బి.సి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. బి.సి మరియు ఈ.బి.సి వధువులకు రూ. 675 కోట్లు విడుదల చేశారని బి.సి. సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు.

ఈ విడుదలైన బడ్జెట్ ను 2016-17 నుండి 2018-19 వరకు ఉన్న బకాయిలకై రూ.44.11 కోట్లు, 2019-2020 మరియు 2020-2021 లబ్దిదారులకై రూ.591.35 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగినది.

రెవెన్యూ డివిజినల్ అధికారులు ఈ నిధులను త్వరితగతిన అర్హులైన వారికి విడుదల చేయాలని కోరారు. ఇప్పటి నుండి గౌరవ మంత్రి వర్యులు మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు, రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ పథకము యొక్క ప్రగతిని సమీక్షిస్తారని మంత్రి తెలిపారు.