హైదరాబాద్ పోలీసుల ఐడియా సూపర్ః అమితాబ్ బచ్చన్

345
Hyderabda Police Amitab
- Advertisement -

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. ఇటివలే జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారుల ఆధ్యర్యంలో నగరంలో నూతన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్ధను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన నూతన సిగ్నల్ విధానం ఏర్పాటు చేశారు.

ఈ నూతన ట్రాఫిక్ సిగ్నల్ అమరిక వల్ల జీబ్రా క్రాసింగ్‌కు కొద్దిగా ముందుగానే వాహనదారులు తమ వాహనాలను నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో పాదచారులు సులువుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెడ్‌ సిగ్నల్‌ పడ్డప్పుడు రోడ్డును దాటుతున్నారు. ఈ లైట్ల అమరికతో మరో వైపు వాహనదారుల్లో రహదారి క్రమశిక్షణ సైతం అలవడుతుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఈసిగ్నలింగ్ వ్యవస్ధను చూసిన అమితాబ్ బచ్చన్ తెలంగాణ పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సూపర్ ఐడియా అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ నూతన సిగ్నల్ వ్యవస్ధను హైదరాబద్ మొత్తం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

- Advertisement -