ప్రపంచ చిత్ర పరిశ్రమల్లోని పలువురు నటినటులు వారి నటన, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అబ్బురపరిస్తున్నారు. అయితే ఒక్క పాత్ర కోసం గంటలు తరబడి మేకప్ వేయించుకోవాలి. అది తీయడానికి మరో కొన్ని గంటలు. ఈ తరం నటీనటులకు ఇది పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఏడు పదుల వయసులోనూ విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నారు.
ఆయనే బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్ బచ్చన్. 76 ఏళ్ళ వయస్సులోను కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. అమితాబ్ ప్రస్తుతం సూజిత్ సర్కార్ దర్శకత్వంలో గులాబో సితాబో అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా చిత్రంలో ఆయన లుక్‌కి సంబంధించిన ఫోటోని షేర్ చేశారు తరణ్ ఆదర్శ్. ఇందులో అమితాబ్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
భారీగా పెరిగిన గడ్డంతో, ముస్లిం వృద్ధుడిగా అమితాబ్ కనిపిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం లక్నోలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అమితాబ్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవీ ‘సైరా’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.