అమితాబ్‌ ఆరోగ్యంపై పుకార్లకు చెక్!

2
- Advertisement -

బాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Big B) తన ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరదించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారంటూ నడుస్తున్న ప్రచారాన్ని ముంబైలోని తన నివాసం ‘జల్సా’ వేదికగా పటాపంచలు చేశారు. తన శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆదివారం సాయంత్రం జల్సా బంగ్లా వెలుపల వేలాదిగా తరలివచ్చిన అభిమానుల ముందుకు బిగ్ బీ స్వయంగా నడిచి వచ్చారు. ఆయనను చూడగానే జల్సా వెలుపల ఉన్న అభిమానుల కోలాహలం మిన్నంటింది.

అమితాబ్ బచ్చన్ పూర్తి ఉత్సాహంతో, ఎనర్జిటిక్‌గా కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ఆదివారం తన అభిమానులను కలుసుకునే ఆనవాయితీని 83 ఏళ్ల అమితాబ్ ఈసారి కూడా అస్సలు మిస్ చేయలేదు. తెల్లటి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆయన, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.

తనను చూడటానికి వచ్చిన జనసందోహాన్ని చూసి ఉద్వేగానికి లోనైన బిగ్ బీ.. నవ్వుతూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అభిమానుల వైపు చేతులు ఊపుతూ, ‘ఫ్లయింగ్ కిసెస్’ (Flying Kisses) ఇస్తూ వారందరిపై తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. గత వారం రోజులుగా అమితాబ్ కడుపునొప్పితో నానావతి ఆసుపత్రిలో చేరారని, మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారని కొన్ని మీడియా ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే, ఆయన కేవలం తన రెగ్యులర్ నెలవారీ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లారని, పరీక్షలు ముగిసిన వెంటనే హోమ్‌కు చేరుకున్నారని సమాచారం. నిన్న ఆయన స్వయంగా బయటకు రావడంతో ఆ వార్తలన్నీ అవాస్తవాలని తేలిపోయింది.

Also ead:కేకేఆర్ ఆటగాళ్లపై రహానే ప్రశంసలు

- Advertisement -