ర‌జ‌నీకాంత్ కు విషెస్ చెప్పిన అమితాబ్..

302
amitab
- Advertisement -

నేడు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లువ‌రు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ఒక్క త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా త‌న‌దైన స్టైల్ తో మంచి గుర్తింపును ఏర్పాటుచేసుకున్నారు. ఇటివ‌లే విడుద‌లైన ఆయ‌న సినిమా 2.ఓ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక‌మైన స్టైల్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. డిసెంబ‌ర్ 12, 1950లో జ‌న్మించిన ర‌జ‌నీకాంత్ నేటితో 68వ ప‌డిలోకి అడుగుపెట్టారు.

ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానులు ర‌క్త దానాలు, అన్న‌దానాల‌తో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇక ప‌లువురు రాజ‌కీయ నాయకులు, సినీ సెల‌బ్రేటీలు కూడా ఆయ‌నకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్‌తో దిగిన ఫోటోల‌న్నింటిని షేర్ చేస్తూ..జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఆయ‌న తాజాగా చేస్తున్న సినిమా పేటా. ఈసినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా నేడు పేటా టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -