కుల గణన చేస్తాం:అమిత్ షా

11
- Advertisement -

జనగణన (Census) లేకుండానే మహిళా రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని విపక్షాలు ప్రశ్నించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బదులిచ్చారు. దేశంలో ఇప్పటికే జనగణన ప్రక్రియ ప్రారంభమైందని, వ్యక్తిగత సమాకరణ దశలో కుల గణన (Caste Census) కూడా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.

సోనియా గాంధీ: “నా పార్టీ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం, అదనంగా చెప్పడానికి ఏమీ లేదు” అని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ క్లుప్తంగా స్పందించారు.

అఖిలేష్ యాదవ్ (ఎస్పీ): మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా ఉండాలని సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేసింది. “కేంద్రం అత్యుత్సాహంతో, రాజ్యాంగాన్ని వక్రీకరించేలా ఈ బిల్లులను తెస్తోంది” అని విమర్శించారు.

అసదుద్దీన్ ఒవైసీ: ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఒవైసీ ఆరోపించారు. దీనివల్ల ముస్లిం ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు అదనపు అధికారం లభిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించనున్నారు.ప్రస్తుతం ఎన్డీయేకు 292 సీట్లు, విపక్షాలకు 233 సీట్లు ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కావడంతో అందరి దృష్టి పార్లమెంట్ పైనే ఉంది.

Also Read:దక్షిణాదికి అన్యాయం జరగకూడదు:గుత్తా

బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో బయట నిరసనలు జరుగుతుండగా, పార్లమెంట్ లోపల ‘ఇండియా’ కూటమి పక్షాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.

- Advertisement -