అమిత్ షాతో రెజ్లర్ల చర్చలు.. నో యూస్ !

36
- Advertisement -

ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మహిళా రెజ్లర్ల వ్యవహారం.. ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. మహిళా రెజ్లర్ల పై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిల వేధింపులకు పాల్పడుతున్నాడని రెజ్లర్లు ఆందోళన బాటా పట్టిన సంగతి విధితమే. సొంత పార్టీ నేతపై ఈ రకమైన ఆరోపణలు వస్తున్నప్పటికి మోడీ, అమిత్ షా వంటి వారు ఇంతవరకు స్పందించకపోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమతూ వచ్చాయి. కాగా ఇది బీజేపీని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర అని కమలం పార్టీ నుంచి వినిపిస్తున్న మాట.

అయితే దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రెజ్లర్లు.. మానపానాలను రాజకీయం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుందని, బీజేపీ నేత చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నారనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అయితే తాను తప్పు చేసినట్లు ఆధారాలు చూపించాలని, ఒకవేళ రుజువైతే తాను బహిరంగ ఊరికి సిద్దమని బ్రిజ్ భూషణ్ ఇప్పటికే సవాల్ విసిరారు. దీంతో ఎవరిది కరెక్ట్ ? ఎవరిది రాంగ్ ? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.

Also Read: అన్నీ స్థానాల్లోనూ బి‌ఆర్‌ఎస్ హవా !

ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో నేడు రెజ్లర్లు భేటీ అయ్యారు. వారికి తగిన న్యాయం జరగాలని, బ్రిజ్ భూషణ్ పై నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని రెజ్లర్లు కోరినట్లు సమాచారం. దీనిపై అమిత్ షా నుంచి సానుకూల స్పందన రాలేదని రెజ్లర్ సాక్షి మాలిక్ భర్త సత్యవత్ కడియన్ చెప్పుకొచ్చారు. దీంతో అమిత్ షా నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రానందున రెజ్లర్లు వారి ఆందోళనను మరింత ముమ్మరం చేసేందుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది, నిరసనను కొనసాగించడం, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ చేయడం పై ఫోకస్ చేసినట్లు రెజ్లర్లు చెబుతున్నారు. న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని కూడా స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ముందు రోజులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read: CM KCR:ధరణితో భూసమస్యలకు చెక్

- Advertisement -