అమిత్‌షాను విలన్ అంకుశం రామిరెడ్డితో పోల్చిన ఎమ్మెల్యే..

123
amith shah
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరంటే ఎవరైనా అమిత్‌షా పేరు ఠక్కున చెబుతారు..కానీ బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే సురేంద్రయాదవ్ మాత్రం అమిత్‌షా అంటే మన టాలీవుడ్ విలన్ అంకుశం రామిరెడ్డి అని చెబుతున్నరు..ఈ నెల 22 న అమిత్‌షా పుట్టిన రోజు సందర్భంగా ఆర్జీడీ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్ ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ చెప్పారు.

హ్యాపీ బర్త్‌డే టు అవర్ హోంమినిష్టర్ అమిత్‌షాజీ అంటూ విషెస్ చెప్పిన సురేంద్రయాదవ్ అమిత్‌షా ఫోటోకు బదులుగా మన టాలీవుడ్ ఫేమస్ విలన్ దివంగత అంకుశం రామిరెడ్డి ఫోటోను తన ట్వీట్‌కు ట్యాగ్ చేయడం కాంట్రవర్సీగా మారింది. అంటే అమిత్‌షా‌ దేశానికి విలన్‌లా తయారయ్యాడని ఉద్దేశం వచ్చేలా ఆర్జేడీ ఎమ్మెల్యే సురేంద్ర యాదవ్ ట్వీట్ చేశాడని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాగా సురేంద్రయాదవ్ 1990 నుంచి ఆర్జేడీ తరపున బెలగాంజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఓసారి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అయితే సీనియర్ నేత అయిన సురేంద్రయాదవ్ కావాలని అమిత్‌షా ఫోటోకు బదులుగా విలన్ రామిరెడ్డి ఫోటో వాడారా అన్నది బీహార్ రాజకీయవర్గాల్లో సస్పెన్స్‌గా మారింది..మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యే ట్వీట్‌పై తెలుగు నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

రైతన్నలపై కర్కశంగా కార్లతో తొక్కిస్తూ వారి ప్రాణాలు బలితీసుకుంటున్న కాషాయమంత్రులను వెనకేసుకువస్తున్న అమిత్‌షా దేశం పాలిట విలన్‌గా తయారయ్యాడని, అందుకే ఆర్జేడీ ఎమ్మెల్యే సురేంద్రయాదవ్ అమిత్‌షాను విలన్ అంకుశం రామిరెడ్డితో పోలుస్తూ ఆయన ఫోటోను వాడారని కొందరు నెట్‌జన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం రాజకీయ విమర్శలను పక్కనపెడితే తనదైన విలనిజంతో మన టాలీవుడ్ లెజండరీ విలన్ అంకుశం రామిరెడ్డి నార్త్ ఇండియాలో సైతం పాపులర్ కావడం హ్యాపీగా ఉందని ట్వీట్స్ చేస్తున్నరు. మొత్తంగా బర్త్‌డే నాడు ఆర్జేడీ ఎమ్మెల్యే సురేంద్రయాదవ్ అమిత్‌షాకు బర్త్‌డే విషెస్ చెబుతూ మన అంకుశం రామిరెడ్డి ఫోటోను పోస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -