గ్యాస్ బండకు దండం పెట్టు..బీజేపీని బొందపెట్టు..!

101
etela
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ , మంత్రి హరీష్‌రావు ఇచ్చిన నినాదం బీజేపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకున్న మంత్రి హరీష్‌రావు నియోజకవర్గమంతటా తిరుగుతూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వెన్నుపోటు రాజకీయాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. మరోవైపు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను పదేపదే ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెరిగిన గ్యాస్, డీజిల్ , పెట్రోలో ధరలపై మండిపడుతున్నారు. మోదీ సర్కార్ అస‌మ‌ర్థ పాల‌న వ‌ల్లే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయంటూ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌తి స‌భ‌లోనూ చెబుతున్నారు. హుజురాబాద్ బై పోల్‌లో మహిళల ఓట్లే అధికంగా ఉండడంతో వంట గ్యాస్ ధరలపెంపుపై హరీష్‌రావు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

గతంలో రూ. 400 ఉన్న గ్యాస్ బండ ధర ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిందంటే దానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అంటూ విరుచుకుపడుతున్నారు. కాగా వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై సమర్థించుకోలేక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతమతమవుతున్నరు. తొలు గ్యాస్ బండలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 291 రూపాయలు వెళుతుందని, దానికి కేసీఆర్ తగ్గించుకోవడం లేదంటూ ఈటల, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు చేసిన దుష్ప్రచారం ఫలించలేదు. గ్యాస్ బండ ధరలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది పాతిక రూపాయలే అని అంతకంటే ఎక్కువ వస్తుందని తెలిస్తే నామంత్రి పదవికి రాజీనామా చేస్తా..అంటూ హరీష్‌రావు దమ్మున్న సవాల్ విసరడంతో ఈటల గ్యాంగ్ సైలెంట్ అయింది. దీంతో గ్యాస్ బండపై అబద్ధాలు ఆడిన ఈటల రాజేందర్‌కు శాలపల్లిలో మహిళలు చుక్కలు చూపించారు. ఇక ప్రచారానికి వెళ్లిన ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డికి కూడా మహిళలు తమ ఇళ్ల ముందు ఖాళీ గ్యాస్ సిలిండర్లు పెట్టిన తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో జమునారెడ్డి మహిళల ఆగ్రహం చూసి ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు గ్యాస్ బండ ధరల పెంపుపై వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈటల రాజేందర్ సొంత ఇలాకా అయిన కమలాపూర్ మండల కేంద్రంలో పేదల ఇళ్లల్లో గ్యాస్ మంట పెట్టిన బీజేపీకి బుద్ధి చెప్పాలంటే…ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించాల్సిందే అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న వినూత్న ప్రచారం ప్రజలను ఆకర్షిస్తోంది. గ్యాస్‌బండ‌కు దండంపెట్టు..బీజేపీని బొంద పెట్టు.. అని రాసిన సిలిండ‌ర్ల‌ను సైకిల్‌కు క‌ట్టుకొని వీధివీధినా తిరుగుతున్నారు.

ధ‌ర‌లు పెంచి సామాన్యుడి న‌డ్డి విరుస్తున్న బీజేపీకి ఓటుతో బుద్ధిచెప్పాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు.. గ్యాస్ బండతో సహా డీజిల్, పెట్రోల్ , నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో ప్రజల్లో బీజేపీపై తీవ్ర ఆగ్రహం రగులుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున ఓటేసే ముందు వంటింటిలోని గ్యాస్ బండకు దండం పెట్టు…కారు గుర్తుకు ఓటేసి, బీజేపీని బొంద పెట్టు అంటూ మంత్రి హరీష్‌రావు ఇచ్చిన నినాదం హుజురాబాద్‌లో వర్కవుట్ అవుతోంది. పెరిగిన గ్యాస్ బండ ధర…ఈటల రాజేందర్ కొంప ముంచుతుందని, మహిళలంతా ఏకమై బీజేపీని బొందపెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా గ్యాస్ బండలతో టీఆర్ఎస్ చేస్తున్న వినూత్న ప్రచారం బీజేపీ నేతలకు తెగ టెన్షన్ పెట్టిస్తుందనే చెప్పాలి.

- Advertisement -