గెల్లు గెలుపుకోసం ఎన్నారై టీఆర్ఎస్ ప్రచారం..

80
nri trs

హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకి ఎన్నారై టీఆర్ఎస్ యూకే విస్తృత ప్రచారం నిర్వహించింది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఎన్నో వారాల నుండి విస్తృత ప్రచారం నిర్వహిస్తోందని అనిల్ కూర్మాచలం తెలిపారు.

ఎక్కడికి వెళ్ళినా మా ఓటు కేసీఆర్ సార్ కే అని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని, సర్వేలన్నీ టీఆర్ఎస్ అభ్యర్థే గెలుస్తాడని చెప్తున్నాయని అనిల్ కూర్మాచలం తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించామని, ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా కేసీఆర్ సార్ వెంటే ఉన్నామని, వెన్నుపోటు ఈటలకు తగిన బుద్ది చెప్తామని ప్రజలు చెప్తున్నట్టు అనిల్ తెలిపారు.