న్యూజెర్సీలో పూర్ణ మాలావత్ అభినందన సభ

458
poorana
- Advertisement -

న్యూజెర్సీ రాష్ట్రంలోని సౌత్ బ్రన్స్విక్ నగరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) వారి ఆధ్వర్యంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మాలావత్ ముఖ్య అతిథిగా “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం వియజయవంతంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని విలాస్ జంబుల స్వాగత ఉపాన్యాసం చేస్తూ పూర్ణ మాలావత్ గారిని సభకు పరిచయం చేయగా , ప్రవీణ్ ఆలా , రవీందర్ గూడూరు, విజయ నాదెళ్ల గారు పూర్ణ మాలావత్ సాధించిన విజయాలు గురించి తెలిపారు.

ఆటా జాయింట్ సెక్రటరీ శరత్ వేముల ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యమం లో పూర్ణ మాలావత్ తమ జిల్లా నిజామాబాద్ నుంచి రావడం తనకు ఎంతో గర్వకారణం అని తెలుపుతూ అంటార్కిటికా ఖండంలో అతిఎత్తైన పర్వతాల్లో ఒకటైన ‘మౌంట్ విన్సన్ మసిఫ్’ పర్వతాన్ని అధిరోహించడం గొప్ప విషయం అని తెలిపారు. రాబోవు కాలములో ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడానికి ఆటా తరుపున కూడా సహాయ సహకారాలు అందిస్తాము అని తెలిపారు, వారిలో భాగముగా శ్రీనివాస్ దార్గుల, విజయ్ కుందూరు, శ్రీకాంత్ గుడిపాటి, రామ్ వేముల ఉన్నారు.

ఆటా మహిళలు ఇందిరా దీక్షిత్ , శిల్పి కుందూరు , నేహా , అర్చన వేముల , నందిని దార్గులా , మాధవి , విజయ అందరు కలిసి శాలువా కప్పి ఘనముగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో సుమారు 100 మంది పిల్లలు పాల్గొని వారు అడిగిన పలు ప్రశ్నలకి పూర్ణ మాలావత్ సమాధానాలు చెబుతూ స్ఫూర్తిగా నిలిచారు.

అంటార్కిటికా ఖండంలో అతిఎత్తైన పర్వతాల్లో ఒకటైన ‘మౌంట్ విన్సన్ మసిఫ్’ పర్వతాన్ని తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్‌ పూర్ణ గత నెల డిసెంబర్ 26న 2019 అధిరోహించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన పూర్ణ.. 2014లో స్కూల్ లో చదువుకునే వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన ఘనత తనది. దాంతో పాటు… ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్ లోని ఎల్బ్రాస్, సౌత్ అమెరికాలోని అకోన్ కాగ్వా, ఓషినియా రిజియన్ లోని కార్ట్స్ నెజ్ ను కూడా ఎక్కారు.

అయితే.. ‘మౌంట్ విన్సన్’ ను అధిరోహించిన పూర్ణ ను అభినందిస్తూ న్యూ జెర్సీ లోని ఆటా అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని చాలామంది ప్రవాస భారతీయులు మెచ్చుకున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించడానికి తాను తీసుకున్న ట్రైనింగ్, జాగ్రత్తలు, మొదలగు విషయాలను అక్కడికొచ్చిన ఎన్నారై లతో పంచుకున్నారు పూర్ణ.

పర్వతాలపై ఉండే వాతావరణం, అక్కడి పరిస్థితులను న్యూ జెర్సీ ఎన్నారై పిల్లందరూ కు క్లుప్తముగా వివరించారు. అతి త్వరలోనే ‘ఎదో’ పర్వతాన్ని సైతం అధిరోహించి తన చిరకాల కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు .. భవిష్యత్తులో పర్వతారోహణలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు పూర్ణ. తెలంగాణ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ తనకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. పూర్ణ ఎవరెస్ట్ ఎక్కిన సాహసాన్ని గుర్తిస్తూ ‘పూర్ణ’ అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాకు సబ్ టైటిల్. కరేజ్ హ్యాజ్ నో లిమిట్.

 poorna

డిసెంబరు 26న అంటార్కిటికా ఖండంలోని విన్సన్‌ మాసిఫ్‌ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో విన్సన్‌ మాసిఫ్‌ ఒకటి. దీని ఎత్తు 16,050 అడుగులు కావడం గమనార్హం. 2014లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని , 2016లో ఆఫ్రికాలోని కిలిమంజారో, 2017లో ఐరోపాలోని ఎల్‌బ్రస్‌, ఒసియానియా రీజియన్‌లోని కార్ట్‌ స్నేజ్‌ పర్వతాలను పూర్ణ అవలీలగా ఎక్కేసింది. తన తర్వాతి లక్ష్యం ప్రపంచంలోని మరో ఎత్తైన పర్వతం ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వతమని స్పష్టం చేసింది. నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామానికి చెందిన పూర్ణ నిరుపేద కుటుంబంలో జన్మించిన సంగతి తెలిసిందే. చదువంతా సాంఘిక సంక్షేమ పాఠశాలలో పూర్తి చేసింది. అక్కడే ఆమెకు పర్వతారోహణ శిక్షణ మొదలైంది. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ ప్రోత్సాహంతో భువనగిరిలో మొదలైన శిక్షణ.. లద్దాఖ్, డార్జిలింగ్‌, మైట్రినా తదితర ప్రాంతాల్లో సాగింది.

‘‘ఎవరెస్టు ఎక్కడం అనేది ప్రాణాలతో చెలగాటం అనేది అందరికీ తెలుసు. కొందరు ఎక్కలేక మధ్యలో వెనుదిరుగుతుంటారు. మరికొందరు మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతుంటారు. మేం వెళ్తుండగా చుట్టుపక్కల శవాలు కూడా కనిపిస్తుంటాయి. ఎలాగైనా అధిరోహించాలనే లక్ష్యంతో 52 రోజుల్లో ఎవరెస్టు అధిరోహించాను. ఏడు ఖండాల్లో.. ఏడు పర్వతాలు అధిరోహించడం నా లక్ష్యం.’’ అని మాలావత్ పూర్ణ అన్నారు.

malavath porna

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి శ్రమించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు శరత్ వేముల (ఆటా జాయింట్ సెక్రటరీ ), ప్రవీణ్ ఆలా (ఆటా న్యూ జెర్సీ రీజినల్ కో-ఆర్డినేటర్), రవీందర్ గూడూరు (ఆటా రీజినల్ డైరెక్టర్ ),విలాస్ రెడ్డి జంబుల (సోషల్ మీడియా చైర్ ).  ఈ కార్యక్రమములో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఏనుగుల , సంతోష్ ,శ్రీకాంత్ తుమ్మల, విలాస్ఓ జంబుల , ఓవర్సీస్ కాంగ్రెస్ ఇంచార్జి రాజేందర్ దిచపల్లి, కమ్యూనిటీ లీడర్స్ ఐన మహేందర్ ముస్కు , రమేష్ , తెలుగు కళా సమితి నుండి సుధాకర్ ఉప్పల , రాచకుల్ల మధు , న్యూ జెర్సీ తెలంగాణ , రవి దాన్నెపెనేని , మహేష్ పొగాకు ,కళాభారతి ప్రదీప్ సువర్ణ, గురు అల్లంపల్లి , ఇతరులు బుసరాజన్ శ్రీదత్ రెడ్డి , బుసరాజన్ రాంరెడ్డి , హేమ ప్యూర్ సంస్ధ నుండి పాల్గొన్నాయి

- Advertisement -