అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. అయితే ఒకటి రెండు రాష్ట్రాల్లో ఓట్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగా దీంతో ఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మరో 6 ఓట్లు సాధిస్తే జో గెలిచినట్టే. అటు పెన్సిల్వేనియా, జార్జియాలోనూ జో బైడెన్ కు అనూహ్యమైన మద్దతు లభించింది. దీంతో అయన గెలుపు లాంఛనంగా మారే అవకాశం ఉంది. మిషిగన్ ఫలితాలపై ట్రంప్ వర్గం నిరాశతో ఉంది. వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రిపబ్లికన్లు కోర్టులో కేసులు దాఖలు చేశారు.
గతంలో 2000 సంవత్సరంలో జార్జి బుష్ జూనియర్ కూడా ఇలానే సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడా కౌంటింగ్ విషయంలో అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. కౌంటింగ్ లో వచ్చిన ఆధిక్యతను బట్టి బుష్ ను విజేతగా ప్రకటించారు. అయితే, కౌంటింగ్ జరుగుతున్న కొద్ది బుష్ ఆధిక్యత తగ్గుతూ వచ్చింది. దీంతో ప్రత్యర్థి అల్ గోరె ఫ్లోరిడాలోని అన్ని ప్రాంతాల్లోని ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేశారు. దీంతో బుష్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో నవంబర్ 3 న ఎన్నికలు జరిగితే, డిసెంబర్ 12 వరకు ఆగాల్సి వచ్చింది.