విద్యార్థితో సెక్స్‌లో పాల్గొన్నారు అమెరికాకు చెందిన ఓ టీచర్. ఎనిమిదేళ్ల కిందట తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో లేడీ టీచర్ తనతో శృంగారంలో పాల్గొందని యువకుడు ఆరోపణలు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మేరీల్యాండ్ రాష్ట్రం మాంట్‌గోమెరి కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాంట్‌గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్‌లో మెలిసా మేరి కర్టిస్ అనే యువతి గతంలో టీచర్‌గా పనిచేసింది. అదే పాఠశాలలో ఎనిమిదో గ్రేడ్ చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థితో కర్టిస్ శృంగారంలో పాల్గొంది. 2015లో ఈ ఘటన జరగగా అప్పటికి ఆమె వయసు 22 ఏళ్లు. తనతో టీచర్ బలవంతంగా శృంగారం చేయించిందని ఆరోపణలు చేయగా ఆమెను అరెస్ట్ చేశారు.
విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి, డ్రగ్స్ ఇచ్చిన కర్టిస్ 20 కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకునేందుకు లోతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read:‘రాజమౌళి’ని వదిలేసి రిస్క్ చేశాడా?