అగ్రరాజ్యం అమెరికాను తాకింది దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పటికే 12 దేశాలను చుట్టేసిన ఈ మహమ్మారి అమెరికాకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైట్‌హౌజ్ ప్రకటించింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు.. అతనితో కాంటాక్ట్ అయిన వారికి కూడా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్‌గా వచ్చిందని వెల్లడించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో అమెరికా పౌరులంతా త్వరగా పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, వీలైనవాళ్లు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని సూచించారు చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ.
అమెరికాతో పాటు సౌదీ అరేబియా, యూఏఈలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు టెస్ట్‌లు తప్పనిసరి చేశాయి.