అమెరికాకు గర్వకారణంగా ఇండో అమెరికన్లు..

99
biden

భారత అమెరికన్లు దేశానికే గర్వకారణం అన్నారు అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. అంగార‌క గ్ర‌హంపై ప‌ర్సీవరెన్స్ రోవ‌ర్ దిగిన నేప‌థ్యంలో నాసా శాస్త్ర‌వేత్త‌లతో బైడెన్ వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

భార‌త సంత‌తి ప్ర‌జ‌లు అమెరికాలో ఉన్న‌త స్థానాల‌ను అధిరోహిస్తున్న‌ట్లు బైడెన్ తెలిపారు. అమెరికాలో స్థానికుల క‌న్నా భార‌తీయులే రాణిస్తున్నార‌ని, నాసా ఇంజినీర్ స్వాతి మోహ‌న్‌, ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్‌, స్పీచ్ రైట‌ర్ విన‌య్ రెడ్డిని ఆయ‌న మెచ్చుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన గ‌త 50 రోజుల్లో.. బైడెన్ ప్ర‌భుత్వం సుమారు 55 మందికి కీల‌క ప‌ద‌వుల‌ను అప్ప‌గించగా ప్ర‌భుత్వంలోని ప్ర‌తిశాఖ‌లోనూ భార‌తి సంత‌తి వ్య‌క్తులు ఉన్నారు. ‌

ఇటీవ‌ల అమెరికా ప్ర‌యోగించిన ప‌ర్సీవరెన్స్‌ రోవ‌ర్ ప్రాజెక్టులో ఇంజినీర్ స్వాతి మోహ‌న్ కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రోవ‌ర్ ల్యాండింగ్ మిషన్‌కు కంట్రోల్ ఆప‌రేష‌న్స్‌ ఆమె సార‌థ్యంలోనే సాగాయి.