ట్రంప్ దంపతులకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ

330
Trump india
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న ట్రంప్ దంపతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , గుజరాత్ గవర్నర్, ముఖ్యమంత్రి విజయ్ రూపానిలు స్వాగతం పలికారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ‘నమస్తే ట్రంప్‌’ వేదిక వరకు వారు చేరుకోనున్నారు.

మధ్యాహ్నం 12.15 గంటలకు అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. 1.05 గంటలకు మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు ఆగ్రాకు బయల్దేరనున్నారు. సాయంత్రం 5.15గంటలకు ఆగ్రాకు ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. సాయంత్రం 6.45గంటలకు ఆగ్రానుంచి తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ఉదయం 9.55గంటలకు రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నారు. రేపు ఉదయం 10.45గంటలకు రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధికి ట్రంప్ నివాళి అర్పించనున్నారు. రేపు ఉదయం 11.25గంటలకు హైదరాబాద్ హౌస్ కు వెళ్లనున్నారు. అనంతరం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ ను సందర్శించనున్నారు ట్రంప్ దంపతులు. రేపు మధ్యాహ్నం 2.55గంటలకు యూఎస్ ఎంబసికి చేరుకోనున్నారు ట్రంప్. రేపు సాయంత్రం 4గంటలకు యూస్ ఎంబసి సిబ్బందితో ట్రంప్ సమావేశంకానున్నారు. రేపు సాయంత్రం 5గంటలకు హోటల్ మౌర్యాకు చేరుకోనున్నారు ట్రంప్. రేపు రాత్రి 7.25గంటలకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు ట్రంప్. రేపు రాత్రి 8గంటలకు ట్రంప్ దంపతలుకు విందు ఇవ్వనున్నారు రాష్ట్రపతి. అనంతరం రాత్రి 10గంటలకు తిరిగి అమెరికాకు పయనం కానున్నారు ట్రంప్ దంపతులు.

- Advertisement -