మలక్కా జలసంధిపై కన్నేసిన అమెరికా!

9
- Advertisement -

ప్రపంచ రాజకీయాలను మరియు ఆర్థిక వ్యవస్థను శాసించగల అత్యంత వ్యూహాత్మక కూడలి ‘మలక్కా జలసంధి’ (Strait of Malacca) పై అమెరికా తన పట్టును బిగిస్తోంది. తాజాగా ఇండోనేషియాతో కుదుర్చుకున్న ఒక కీలక ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఒప్పందంలో భాగంగా, ఇండోనేషియా గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు నిరంతరం నిఘా ఉంచడానికి అనుమతి లభించింది. మలక్కా జలసంధి మీదుగా సాగే ప్రతీ కదలికను అమెరికా ఇప్పుడు తన అధునాతన యుద్ధ విమానాల ద్వారా పర్యవేక్షించనుంది. ఇది ఆ ప్రాంతంలో అమెరికా సైనిక ప్రాబల్యాన్ని మరింత పెంచడమే కాకుండా, ప్రత్యర్థి దేశాలకు గట్టి హెచ్చరికగా మారింది.

ఈ పరిణామం చైనాకు అత్యంత ఆందోళన కలిగించే విషయం. చైనాకు అవసరమైన ముడి చమురులో దాదాపు 80 శాతం ఈ మలక్కా జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచ సరుకు రవాణాలో 40 శాతం వాటా ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా ఈ మార్గాన్ని గనుక దిగ్బంధిస్తే (Blockade), చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే దీనిని చైనా ‘మలక్కా డైలెమ్మా’ (Malacca Dilemma) అని పిలుస్తుంటుంది.

Also Read:ఎంతసేపు స్క్రీన్ చూస్తే ప్రమాదమో తెలుసా?

ఇండోనేషియాతో అమెరికా చేతులు కలపడం ద్వారా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి అగ్రరాజ్యం సిద్ధమైందని స్పష్టమవుతోంది. మలక్కా జలసంధిపై పట్టు సాధించడం అంటే, ప్రపంచ వాణిజ్యం మరియు ఇంధన సరఫరాపై అదుపు సాధించడమే.

- Advertisement -