GIC:హరిత విప్లవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు

8
- Advertisement -

భారతదేశ హరిత విప్లవానికి ప్రపంచ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది సుందర్బన్స్ మడ అడవుల పరిరక్షణ కార్యక్రమం. జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక జాతీయ సాంస్కృతిక రేడియో డ్యూచ్‌లాండ్‌ఫంక్ కల్తుర్’ ద్వారా ఈ ఉద్యమానికి ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు.

ప్రకృతి, దృఢ సంకల్పం, సామాజిక స్ఫూర్తి కలగలిసిన సుందర్బన్స్ మడ అడవుల పెంపకంపై జర్మన్ రేడియో ప్రత్యేక ప్రసారం చేసింది. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ దర్శనికతతో రూపుదిద్దుకుంది ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఉద్యమం.

సంతోష్ కుమార్ నాయకత్వంలో చెట్లు నాటడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం చేతులు కలిపారు లక్షలాది మంది ప్రజలు. ప్రపంచంలోనే అతిపెద్ద పౌర-నేతృత్వ వాతావరణ ఉద్యమాలలో ఒకటిగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ గుర్తింపు పొందింది. ఈ పర్యావరణ కార్యక్రమాన్ని ప్రముఖంగా ప్రసారం చేసింది జర్మనీ జాతీయ సాంస్కృతిక రేడియో.

సుందర్బన్స్‌లోని పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, సామాజిక సాధికారత కలిసిన నమూనాగా నిలిచింది అంటూ ప్రశంశలు గుప్పించింది. లక్షలాది మంది పౌరులు చెట్లు నాటడం, పర్యావరణ పునరుద్ధరణలో భాగస్వాములయ్యారు. భారతదేశం వాతావరణ, గ్లోబల్ గ్రీన్ మూవ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది గ్రీన్ ఇండియా చాలెంజ్.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

- Advertisement -