మొక్కలు నాటిన చొప్పదండి ఏఎంసీ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్..

31
karimnagar

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో చొప్పదండి మార్కెట్ లో కమిటీ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహాద్భుతంగా ముందుకు కొనసాగుతోంది.రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టాలని సీఎం కెసిఆర్ గారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ పకృతి వణంలా పచ్చగా ఉండాలని హరిత హరం కార్యక్రమం తీసుకున్న అద్భుతమైన కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ గారు మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నటే కార్యక్రమం చేపట్టారు.

అందులో బాగంగా ఈరోజు చొప్పదండి మార్కెట్ లో మొక్కలు నాటడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని దీనిని ప్రతి ఒక్కరూ స్వీకరించి మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.