వైభవంగా అంబికా కృష్ణ మనవడి రిసెప్షన్..

267
- Advertisement -

ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ‘అంబికా’ కృష్ణ మనవడి పెళ్లి రిసెప్షన్ జులై 7న రాత్రి హైదరాబాద్ లోని జె ఆర్ సి కాన్వెంషన్ హాల్ లో సినీ రాజకీయ ప్రముఖుల ఆగమనంతో ఘనంగా జరిగింది. అంబికా కృష్ణ తనయుడు అంబికా రామచంద్ర రావు-సునీతల కుమారుడు వినాయక సూర్య కుమార్, చెన్నై కి చెందిన ఉమ్మిడి ముకుంద-మంజులల కుమార్తె ప్రీతిక లక్ష్మి తో జులై 1న చెన్నై లో వివాహం జరిగింది. కాగా హైదరాబాద్‌లో జులై 7న రాత్రి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

Ambica Krishna Grandson Wedding Reception

ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, ఈనాడు పత్రికాధినేత రామోజీ రావు, తనయుడు కిరణ్, దర్శకుడు కె రాఘవేంద్ర రావు, పార్లమెంట్ సభ్యులు మురళి మోహన్, బ్రహ్మానందం, మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి, దర్శకుడు క్రిష్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, నారా లోకేష్, మాజీ ముఖ్య మంత్రి కె .రోశయ్య, యస్ వి కృష్ణా రెడ్డి- అచ్చి రెడ్డి, చోట కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కన్నడ హీరో ఉపేంద్ర, హీరో శ్రీకాంత్-ఊహ, ఆర్యన్ రాజేష్, మోహన్ బాబు సతీమణి, కృష్ణం రాజు సతీమణి విచ్చేశారు.

Ambica Krishna Grandson Wedding Reception

ఇంకా..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి, కాదంబరి కిరణ్, వినోద్ బాల, యల్ బి శ్రీరామ్, నిర్మాత బండ్ల గణేష్, హీరో తరుణ్, నిర్మాత పోకిరి బాబు రావు, వందేమాతరం శ్రీనివాస్, భీమనేని శ్రీనివాస రావు, నటుడు సుమన్, నటుడు రఘుబాబు, సీనియర్ నటి గీతాంజలి, టి జి వెంకటేష్, దర్శకుడు కోడి రామకృష్ణ, జీవిత రాజశేఖర్, పత్రికాధినేత వేమూరి రాధాకృష్ణ, టివి 5 అధినేత బి ఆర్ నాయుడు, హాస్య నటుడు వేణు మాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Ambica Krishna Grandson Wedding Reception 4U2A7900

- Advertisement -