‘సాక్ష్యం’ మూవీ ట్రైలర్..

198
Saakshyam Theatrical Trailer

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. చివరి షెడ్యూల్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా జులై 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శనివారం ఆడియో వేడుకలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ‘సాక్ష్యం’ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

Saakshyam Theatrical Trailer

ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ లాగే ట్రైలర్ కూడా భారీగా కనిపిస్తోంది. ఇక విషయానికొస్తే.. డైలాగులు ఎకువగా ఆకట్టుకోలేదు. ఇదోక రివెంజ్ స్టోరీ అని తెలుస్తుంది. ఒక తప్పు చేసి దానికి సాక్ష్యాల్లేకుండా చేసే ఉద్దేశంతో హీరో కుటుంబాన్ని విలన్లు అంతమొందిస్తారు. పసివాడిగా ఉన్న హీరో తప్పించుకుంటాడు. తర్వాత తిరిగొచ్చి అందరినీ అంతమొందిస్తాడు.

అయితే ఈ రివెంజ్ స్టోరీలో పంచభూతాలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా దీన్ని కొంచెం భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు శ్రీవాస్. హీరో శ్రీనివాస్ ‘జయ జానకి నాయకా’ స్టయిల్లోనే కనిపిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలకు సినిమాలో లోటు లేనట్లుంది. హీరోయిన్ పూజా హెగ్డే అందంగా కనిపిస్తోంది. జగపతిబాబు విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు.

#Saakshyam Official Trailer | Bellamkonda Srinivas | Pooja Hegde | Sriwass | Abhishek Nama