మంత్రి కేటీఆర్‌ని మెచ్చుకున్న అంబర్‌పేట ముసలమ్మ..

78
ktr amberpet

ఎడతెరపి లేకుండా కురసిన వర్షాలతో హైదరాబాద్‌ తడిసిముద్దవగా దాదాపుగా రూ. 5 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌ బాధితుల్లో భరోసా కల్పిస్తున్నారు. తాను పర్యటించిన ప్రాంతాల్లో బాధితులకు స్వయంగా ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధికసాయం రూ.10 వేలను అందజేస్తున్నారు.

ఇక ఇవాళ అంబర్ పేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌పై స్ధానిక ముసలమ్మ ప్రశంసలు గుప్పించింది.మిమ్మల్ని రోజు తలుచుకుంటూ ఉంటా అంటూ మీరు మంచి పనులు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ను మెచ్చుకుంది. ఈ సందర్భంగా ముసలవ్వను ఆప్యాయంగా పలకరించి మేము ఉన్నాం అంటూ ధైర్యం నింపారు కేటీఆర్‌. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , స్థానిక కార్పొరేటర్లు , జి.హెచ్.ఎం.సి అధికారులు తదితరులు పాల్గొన్నారు.