గులాబీ మయమైన దుబ్బాక….

114
kotha prabhakar reddy

దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ యస్ పార్టీ అభ్యర్ధి సోలిపేట సుజాత మద్దతుగా ప్రచారం నిర్వహించిన మంత్రి తన్నీరు హరీష్ రావు,ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి పై పూల వర్షం కురిపించారు.

దుబ్బాక పుర విధుల్లో టి అర్ ఎస్ కు మద్దతుగా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో దుబ్బాక గులాబీ మయమైంది. మంగళ హరతులు.. డప్పు చప్పుళ్లు,బతుకమ్మలతో సాదర స్వాగతం పలికారు మహిళలు.

దుబ్బాక మండలంలోని దుంపలపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.