రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు బర్కత్ పూరలోని జిహెచ్ఎంసి పార్క్‌లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి అరుణ ఫొటో స్టూడియో MD నిమ్మల సతీష్ మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంతోష్ మంచి కార్యక్రమం చేపట్టారని అందులో భాగంగా మేము కూడా మొక్కలు నాటడం జరిగింది అని అదేవిధంగా మా అరుణ స్టూడియోకి వచ్చే కస్టమర్స్ అందరికీ ఉచితంగా పారిజాతం మొక్కలు ఇస్తున్నామని తెలిపారు.
ప్రజలందరూ ఇదేవిధంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారి కృష్ణ,పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు శేషునారాయణ,శ్యామ్; వివేక్; లక్ష్మణరావు,రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ ధనంజయ రెడ్డి, గోపాల్ రెడ్డి, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.