- Advertisement -
జాలర్ల వలలో భారీ తిమింగలం చిక్కింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన తమిళనాడు జాలర్లకు రూ. 50 కోట్ల విలువైన అంబర్గ్రిస్ దొరికింది. అంబర్గ్రిస్ అనేది తిమింగలం వాంతి. దీనిని సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.
తిమింగలాల కడపులో తయారయ్యే దీనిని అవి వాంతి రూపంలో బయటకు పంపుతాయి. దీనిని ‘ఫ్లోటింగ్ గోల్డ్’గానూ వ్యవహరిస్తారు. తాజాగా ఇది కల్పాక్కం సమీపంలోని జాలర్ల వలకు చిక్కింది. దీని విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీ అధికారులకు తెలిపారు.
- Advertisement -