తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ప్రపంచకప్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు పలికి మళ్లీ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుపుతూ, ఇటీవల రాయుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశాడు. తాజాగా అంబటి రాయుడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు.
రాయుడిని హైదరాబాద్ కెప్టెన్ గా ఎంపీక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 11 వరకు బెంగళూరులో జరగనున్న విజయ్ హజారే టోర్నీ కోసం హైదరాబాద్ జట్టును ప్రకటించిన సెలక్టర్లు అంబటికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. పేసర్ మహ్మద్ సిరాజ్, సి.వి మిలింద్‌లు హైదరాబాద్ తరఫున ఆడనున్నారు. బి. సందీప్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక రాయుడి ఛాప్టర్ క్లోజ్ అవుతుందని అనుకున్న సమయంలో ఇలాంటి ఆఫర్ రావడం నిజంగా రాయుడు అదృష్టంగా భావించవచ్చు..
హైదరాబాద్ వన్డే జట్టు : అంబటి రాయుడు (కెప్టెన్), బి. సందీప్ (వైస్ కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మరు అగర్వాల్, ఠాకూర్ తిలక్ వర్మ, రోహిత్ రాయుడు, సి.వి మిలింద్, మెహిది హసన్, సాకెత్ సాయిరాం, మహ్మద్ సిరాజ్, మికిల్ జైశ్వాల్, జె. మల్లికార్జున (వికెట్ కీపర్), కార్తీకేయ, టి. రవితేజ, అజరు దేవ్ గౌడ్. విక్రమ్ నాయక్, తనరు త్యాగరాజన్, అభిరాత్ రెడ్డి, ప్రణీత్ రాజ్, రాక్షణ్ రెడ్డి స్టాండ్‌బైలు ఎంపికయ్యారు .