- Advertisement -
ఐపీఎల్‌లో అంబటి రాయుడు తన ఫేవరేట్ ప్లేయర్‌లలో ఒకడని తెలిపాడు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన బ్రావో …ఐపీఎల్ సందర్భంగా తన మాటలతో రాయుడిని ఏడిపించేవాడినని తెలిపాడు.
రాయుడు చాలా ప్రతిభ ఉన్న ఆటగాడని కనీ అతడి సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించలేదన్నారు. రాయుడికి కోపం ఎక్కువ..అందుకే తన మాటలతో రెచ్చగొట్టేవాడినని వెల్లడించాడు.
రాయుడిని రెచ్చగొట్టి ఏడిపించడం వల్లే ప్రతి మ్యాచ్‌లో పట్టుదలతో ఆడి మంచి స్కోరు సాధించేవాడని తెలిపాడు. 2018లో చెన్నై టైటిల్ గెలవడంతో రాయుడి పాత్ర కీలకం. ఆ సీజన్‌లో ఏకంగా 602 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు.
- Advertisement -