అంబాజీపేట మ్యారేజి బ్యాండు..అందరూ ఎంజాయ్ చేస్తారు

15
- Advertisement -

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది.

నటి గాయత్రి భార్గవి మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో నటించడం మాకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నవరసాలు ఉన్న సినిమా ఇది. ఆ గ్రామీణ వాతావరణంలో షూటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాం. ఇలాంటి మూవీలో అవకాశం ఇచ్చిన దర్శకుడు దుశ్యంత్, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో సుహాస్, శివాని, శరణ్య ఈ ముగ్గురు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” థియేటర్స్ లో చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు

ఎడిటర్ కొదాటి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఈ మూడేళ్లలో ఆత్మీయుల్లా మారిపోయాం. సినిమాలో ప్రతి ఒక్కరూ ఎంత బాగా పర్ ఫార్మ్ చేశారంటే ఎడిటింగ్ లో ఒక్క సీన్ తీసేయడానికి కూడా మనసు రాలేదు. ఫిబ్రవరి 2న ఆడియెన్స్ కు ఒక సూపర్ హిట్ సినిమా ఇవ్వబోతున్నాం. తప్పకుండా థియేటర్స్ కు రండి. అన్నారు.

లిరిసిస్ట్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ – గీతా ఆర్ట్స్ లో ఇప్పటిదాకా అల వైకుంఠపురములో, వినరో భాగ్యము విష్ణు కథ, బేబి సినిమాలకు పాటలు రాశాను. ఇప్పుడు “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు లిరిక్స్ ఇచ్చాను. వాటిలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో సాహిత్యానికి విలువ ఉండే పాటలు రాసే అవకాశాన్ని నాకు అందించారు దర్శకుడు దుశ్యంత్. మంచి మ్యూజిక్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి కంగ్రాట్స్. ఈ సినిమా సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలకు అద్దం పట్టేలా ఉంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా టైటిల్ యూనిక్ గా ఉంది. ట్రైలర్ చూశాను అంతే యూనిక్ గా అనిపించింది. ఇందులో హార్ట్ టచింగ్ లవ్ స్టోరితో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సుహాస్ మంచి యాక్టర్. నేను రాసే ప్రతి స్క్రిప్ట్ కు సుహాస్ పేరు ఆర్టిస్టుల లిస్టులో రాస్తా. మంచి కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకు కుదిరారు. ప్రొడ్యూసర్స్ కు ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో కీ రోల్ చేశాను. ఇంత బలమైన క్యారెక్టర్ నేను చేసి మెప్పించగలను అని నమ్మిన మా డైరెక్టర్ దుశ్యంత్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. షూటింగ్ టైమ్ లో మా టీమ్ అంతా ఒక కాలేజ్ లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేసినంత అల్లరి చేశాం. అంత హ్యాపీగా షూటింగ్ జరిగింది. మూవీకి పర్పెక్ట్ టీమ్ కుదిరారు. డీవోపీ, మ్యూజిక్, సెట్స్..ప్రతి ఒక్కటీ అందంగా ఉంటాయి. మా సినిమా చూస్తే మేము మూవీ కోసం ఎంత కష్టపడ్డామో తెలుస్తుంది. ఫిబ్రవరి 2న మా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా చూసి మీ ప్రేమను మాపై వెయ్యింతలు పెంచుతారని ఆశిస్తున్నాం. అన్నారు.

Also Read:మార్నింగ్ వాక్..అనేక రోగాలకు చెక్!

- Advertisement -