అంబాజీపేట మ్యారేజి బ్యాండు…సక్సెస్ మీట్

16
- Advertisement -

యంగ్ హీరో సుహాస్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ మూవీ చేర్చుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని చోట్ల నుంచీ సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శివాని నాగరం హీరోయిన్ గా నటించగా..శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” టీమ్ నా దగ్గరకు వచ్చి మనం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా సంతోషమేసింది. ఈ సినిమా రషెస్ చూసినప్పుడు, నిన్న ఫస్ట్ కాపీ చూశాక ఇది చాలా మంచి సినిమా, సక్సెస్ కావాలి అనిపించింది. యాక్షన్, ఇతర అనవసర ఎలిమెంట్స్ లేకుండా స్వచ్ఛంగా ఒక కథ చెప్పారు. ఇటీవల కాలంలో అక్కా తమ్ముడి మధ్య ఎమోషన్స్ తో సినిమా రాలేదు. శరణ్య అక్క క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. ఇంటర్వెల్ టైమ్ కు సుహాస్ యాక్టింగ్ చూస్తుంటే ఈ కుర్రాడు ఏం నటిస్తున్నాడు రా అనిపించింది. అంత సహజంగా నటించాడు. మనకున్న అతి కొద్ది మంది న్యాచురల్ యాక్టర్స్ లో సుహాస్ ఉంటాడు. చాలా పైకి వస్తాడు. ఇక చేయబోయే సినిమాలు కూడా గుడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. శివాని కూడా తన క్యారెక్టర్స్ కు తగినట్లు చేసింది. విలన్ గా నితిన్ ఆకట్టుకున్నాడు. నిర్మాతగా ధీరజ్ నిర్మాతగా ఈ మూవీని బాగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాడు. దర్శకుడు దుశ్యంత్ ప్రతి సీన్ ను చక్కగా తెరకెక్కించాడు. గీతా సంస్థలో భాగమైన ఈ ప్రొడక్షన్స్ అన్నీ సక్సెస్ కావాలి. అందుకు మీడియా సహకారం కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ – నిన్న శ్రీరాములు థియేటర్ లో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ కు హ్యాపీగా అనిపించింది. నాకు మరో హిట్ సినిమా అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. థియేటర్స్ దాకా వచ్చి సినిమా చూస్తున్నారు. సంతోషంగా ఉంది. మీడియా మిత్రులు మా సినిమాకు మంచి రివ్యూస్ రాశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ – మా సినిమా ప్రమోషన్స్ నుంచి సక్సెస్ మీట్ దాకా సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్స్. పద్మ క్యారెక్టర్ ను నేను బాగా చేయగలను అని మా డైరెక్టర్ దుశ్యంత్ నమ్మారు. అది ఇవాళ థియేటర్స్ లో ప్రూవ్ అయినందుకు సంతోషంగా ఉంది. మీరు థియేటర్స్ కు వచ్చి “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీకి మీరు ఇచ్చిన సక్సెస్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. నాలాంటి కొత్త యాక్ట్రెస్ కు ఇంత పెద్ద బ్యానర్, మంచి మూవీలో అవకాశం దక్కడం లక్ అనుకుంటాను. నేను చేసిన లక్ష్మీ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్ వస్తోంది. మా కోస్టార్స్, క్రూ మెంబర్స్ అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది. మీరు థియేటర్ కు వస్తే ఒక మంచి షో చూసిన ఫీల్ కు గురవుతారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్లు మా మూవీని చూడొచ్చు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అన్నారు.

నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్ లోనే చూడాలి. ఓటీటీలకి వస్తుందని కదా అనుకుంటే ఇలాంటి మూవీస్ చేసేందుకు మాకు ప్రోత్సాహం ఉండదు. శ్రీరాములు థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతారని ధీరజ్ కు చెప్పానో అక్కడే రెస్పాండ్ అవుతున్నారు. మీడియా ఫ్రెండ్స్ జెన్యూన్ రివ్యూస్ ఇచ్చారు.
సుహాస్ అద్బుతంగా పర్ ఫార్మ్ చేశాడు. ఈ సినిమా కోసం అతను ఎంత కమిటెడ్ గా పనిచేశాడో మా అందరికీ తెలుసు. పూర్తి ఫోకస్ తో ఉన్నాడు. రెండు సార్లు గుండు చేసుకున్నాడు. తెరపై ఆ ఎఫెక్ట్ కనిపించింది. శరణ్య, శివానీ బాగా పర్ ఫార్మ్ చేశారు. ధీరజ్, నేను, ఎస్ కేఎన్ ..మేమంతా అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ. మా సక్సెస్ కు అరవింద్ గారు ఎంతో సంతోషిస్తారు. అని చెప్పారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మేము ఈ సినిమా చేసేప్పుడు కేవలం కంటెంట్ నే నమ్మాం. మంచి కంటెంట్ అని రిలీజ్ ముందు మేము చెప్పిన మాటలు నమ్మకున్నా..ఇప్పుడు సక్సెస్ తర్వాత అందరికీ తెలిసింది. శ్రీరాములు థియేటర్ లో మీడియాతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్ కు ప్రేక్షకులు కనెక్ట్ అయి ఎంజాయ్ చేయడం చూసి హ్యాపీగా ఫీలయ్యాం. మంచి సినిమాలను ప్రేక్షకులే ముందుకు తీసుకెళ్లాలి. సుహాస్, శరణ్య, శివాని, నితిన్ వీళ్లంతా తమ పర్ పార్మెన్సులతో ఆకట్టుకున్నారు. మీ దగ్గరలోని థియేటర్ లో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని మాట్లాడుతూ – గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తున్నామని తెలిసినప్పుడే డబుల్ రెస్పాన్సిబిలిటీ ఫీలయ్యాం. వాళ్లు మాకు అంత సపోర్ట్ గా నిలిచారు. ఈ కథను ఎక్కడా లోటు లేకుండా తెరకెక్కించాలని చెప్పారు. ఇవాళ ఆడియెన్స్ చూపిస్తున్న రెస్పాన్స్ కు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ కు ప్రేక్షకులు తమ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ లో సిస్టర్ సీన్ వచ్చినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు ఎంతో ఓన్ చేసుకుని నటించడం వల్లే మా సినిమా రీచ్ అయ్యింది. దర్శకుడిగా ఈ సినిమా విజయం నా మీద మరింత బాధ్యత పెంచింది. అన్నారు.

యాక్టర్ నితిన్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో నాకు స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ధీరజ్, డైరెక్టర్ దుశ్యంత్ గారికి థ్యాంక్స్. సుహాస్ గారితో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. నా క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నారు

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్స్. ఇవాళ్టి నుంచి ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ ఫ్యామిలీతో కలిసి వెళ్లి సినిమా చూడండి. ప్రతి ఒక్కరు, అన్ని వర్గాల ఆడియెన్స్ ఇష్టపడతారు. మా గీతా సంస్థలో ఫ్యామిలీ మెంబర్ లాంటి ధీరజ్ కు సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది. థియేటర్ లో ఈ సినిమా చూస్తుంటే ఒక వెయ్యి మంది ఆడియెన్స్ ఒకేసారి తెరపై వచ్చే సీన్స్ కు రెస్పాండ్ అవుతున్నారు. వారికి సినిమా అంతగా నచ్చింది. సుహాస్ తో సహా ప్రతి ఒక్కరి పర్ ఫార్మెన్స్ బాగుంది. అన్ని క్రాఫ్ట్ లు బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాయి. ఇప్పుడప్పుడే ఓటీటీలో ఈ సినిమా రావడం లేదు. థియేటర్స్ లోనే చూడండి. అన్నారు.

Also Read:భారతరత్న.. ఎల్‌కే అద్వానీ

- Advertisement -