అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌…హైదరాబాద్‌లో

1360
amazon hyderabad campus
- Advertisement -

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ భవనాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలికవసతులతో దీనిని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 21న ప్రారంభించనున్నట్లు సమాచారం.

15 అంతస్తుల భవనంలో 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పార్కింగ్‌ ప్రదేశం, మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేసే కార్యాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. ఈ క్యాంపస్‌లో 9 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

అమెజాన్‌కు చెందిన వివిధ గ్లోబల్‌ బిజినెస్‌, టెక్నాలజీ టీమ్స్‌ బ్యాకెండ్‌ కార్యకలాపాలను ఇక్కడ నుంచే ఉద్యోగులు నిర్వహించనున్నారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ (గోదాము)ను శంషాబాద్‌ విమానాశ్రయ సమీపంలో ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఇది నాలుగు లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉంది. 2020 మధ్యకాలం నాటికి దీన్ని 5.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంకు పెంచుకోవాలన్న యోచనలో ఉంది.

అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటుతో హైదరాబాద్ దిగ్గజ కంపెనీలకు కేరాఫ్‌గా మారనుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌, క్వాల్‌కామ్‌లు తమ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి.

- Advertisement -