లేహ్‌లో బ్యాట్ పట్టిన ధోని…

364
ms dhoni

ప్రపంచకప్ తర్వాత రెండు నెలల పాటు క్రికెట్‌కు విరామం ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సైనిక విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ..ఆగస్టు 15న లేహ్‌లో జాతీయ జెండా ఎగురవేశారు.

లేహ్‌లో చిన్నారులతో కలిసి సరదగా క్రికెట్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ బాస్కెట్ బాల్ కోర్టులో బ్యాటింగ్ చేస్తున్న ధోని ఫోటోను పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక త్వరలో లడఖ్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నాడు ధోని.