అమెజాన్‌: 40రోజులు.. చిన్నారులు సురక్షితం

41
- Advertisement -

దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో గల దట్టమైన అమెజాన్‌ అడవుల్లో నలుగురు చిన్నారులు తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే 40రోజుల తర్వాత వారు నలుగురు చిన్నారులు ఎట్టకేలకు సజీవంగా కన్పించారు. ఓ విమాన ప్రమాదం నుంచి వీరు మృత్యుంజయులుగా బయటపడ్డారు. మొత్తంగా ఆ విమానంలో 7గురు ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే.

అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటవ తేదీన విమానం బయలుదేరింది. ఆ విమానంలో నలుగురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. కానీ వీరు ప్రయాణిస్తున్న విమానం టెకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో అది కూలబోతున్నట్టు పైలట్ ప్రకటించారు. అనంతరం ఆ విమానం రాడారు నుంచి తప్పిపోయింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులను క్షతగాత్రులను రక్షించేందుకు ఆపరేషన్ హోప్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16న విమాన శకలాలను గుర్తించారు. అందులో పైలట్ తల్లి గైడ్‌ మృతదేహాలను గుర్తించారు.

అయితే విమానంలో నలుగురు చిన్నారులను గుర్తించలేకపోయారు. ఈ చిన్నారులను వెతికే పనిలో కొలంబియా ప్రభుత్వం సైన్యంను రంగంలోకి దింపింది. వీరిలో 11నెలల పసిపాప,13, 9, 4 ఏళ్ల చిన్నారులు ఉన్నారు. దాదాపు 150మంది సైనికులతో లోకల్‌ ప్రజలతో అమెజాన్‌ను జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే మే 18వ తేదీన పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలియజేసేలా చిన్నగుడారం రిబ్బన్ పాలసీసా సగం తిన్న పండు కనిపించాయి. దీంతో సైనికులు పిల్లలు ఉన్నట్టు ధ్రువీకరించిన అధికారులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన 40రోజుల తర్వాత చిన్నారుల జాడ కనిపెట్టారు. గాలింపు బృందాలు వారి వద్దకు వెళ్లగానే వారు ఒంటరిగానే ఉన్నట్టు ఆదేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. క్రూరమృగాలు తిరిగే ప్రాంతంలో ఇన్ని రోజులుగా ఎలా ఉన్నారని విషయాలు ఇంకా వెల్లడికాలేదు. వారికి ప్రస్తుతం వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. అయితే గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అక్కడక్కడ హెలికాప్టర్ల సహాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పడేశారు. అవే ఆ చిన్నారులకు సాయం చేశాయని అధికారులు భావిస్తున్నారు.

Also Read: కొలంబియా: అమెజాన్‌లో పసివాళ్లు ఏమయ్యారో..!

చిన్నారులు సజీవంగా ఉన్నారనే వార్త తెలియగానే కొలంబియా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొలంబియా అధ్యక్షుడు పెట్రో సంతోషం వ్యక్తం చేస్తూ..ఈ అడవే వారిని రక్షించింది. వారు అడవి పిల్లలు మాకొలంబియాకు కూడా వారసులే అని పోస్ట్‌ చేశారు. అంతేకాదు కొలంబియా సైన్యం మాప్రయత్నాలు ఫలించాయి అని రాస్తూ పిల్లలతో ఉన్న ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సైనికులతో ఉన్న చిన్నారుల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Also Read: రేపే గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష…

- Advertisement -