తాటికల్లు తో కాన్సర్ దూరం…

525
kallu
- Advertisement -

మ‌న పెద్ద‌ల ఆచార వ్య‌వ‌హారాలు అన్నింటికీ ఒక లెక్కుంటుంది. మ‌నొళ్ళు ఏంచెప్పినా ఏం చేసినా దాని వెనుక ఓ లాజిక్ ఖ‌చ్చింతంగా ఉంటుంది. త‌రత‌రాలుగా మ‌నం తాగుతున్న తాటికల్లు వ‌ర‌ప్ర‌సాదం అంటున్నారు నేటి శాస్త్ర‌వేత్త‌లు. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు దివ్యౌష‌ధ‌మ‌నీ దాన్ని సేవిస్తే క్యాన్సర్ మ‌హ‌మ్మారి నయవుతుంద‌నీ తేల్చిచెప్తున్నారు. తాటికల్లు తాగడం ద్వారా అందులో ఉన్న ఔషధ గుణం కడుపులో పెరుగుతున్న క్యాన్సర్ ను నయం చేస్తుందని మ‌న‌ ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది.

kallu

కేవలం కాన్స‌ర్ మాత్ర‌మే కాక‌ చాలా ర‌కాల‌ వ్యాధులను కూడా నివారిస్తుందనీ సైంటిస్ట్ లు చెప్తున్నారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఏడాదిపాటు ప‌రిశొధ‌న‌లు జ‌రిపి తాటి క‌ల్లు దివ్యౌష‌దంగా ఎలా ప‌నిచేస్తుందొ లెక్క‌లు తేల్చారు. ఈ రిసెర్చ్ ను ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ కూడా ధ్రువీకరించింది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలో ఉస్మానియా బయలాజికల్ సైన్స్ ప్రొఫెసర్ భూక్యా భీమా 53 రకాల తాటికల్లు నమూనాలను సేకరించి టెస్టులు చేయగా తాటికల్లులో ఔషధగుణాలు మెండు అని ప్రూ అయింది. ఓయూ బయాలజీ ల్యాబ్ లో సూక్ష్మజీవులను వృద్ధి చేసే రసాయనంలో తాటికల్లు చుక్కలు వేసి పరిశీలిచారు. 48 గంటలపాటు ఇంక్యుబేటర్‌లో పెట్టగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయన్నారు ప్రొఫెసర్ భూక్యా భీమా. 53 రకాల సూక్ష్మజీవులను తాటికల్లులో గుర్తించారు. వీటిలో 18 రకాల సూక్ష్మజీవులు మనిషిలోని వ్యాధికారక సూక్ష్మజీవులను చంపుతున్నట్లు ఐఐసీటీ సైంటిస్టులు గుర్తించారు.

kallu

మన గ్రామాల్లొ కల్లు తాగ‌డాన్ని త‌ప్పుగా చూస్తుంటారు. దానిని కూడా ఓ మద్యంగానే భావిస్తుంటారు.. అప్పుడే చెట్టు మీద నుంచి తీసిన తాటికల్లుతో అనేక ర‌కాల పొష‌కాలు శ‌రీరానికి అంద‌డ‌మే కాకుండా సమృద్ధిగా ఉన్న ఖ‌నిజలవనాలు, ఎన్నో విటమిన్లు ఎన్నొ వ్యాధుల‌ను త‌గ్గిస్తాయ‌నీ ప‌రిశొధ‌న‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. అలాగే భార‌తీయుల పాలిట శాపంగా మారుతొన్న‌ ఊబకాయం, మధుమేహల‌ నియంత్రణకు చ‌క్క‌గా పనిచేస్తొంద‌నీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని శాస్త్ర‌వెత్త‌లు చెబుతున్నారు.

- Advertisement -