ఉగ్రదాడి…పిరికిపంద చర్య

222
Amarnath Yatra attack marks crucial turn in Kashmir militancy
- Advertisement -

సోమవారం రాత్రి 8.20 నిమిషాలకు కన్ బలీ ప్రాంతంలో అమర్ నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం ఏడు మంది మృతిచెందారు. 32 మంది గాయపడ్డారు. అధికార వర్గాల కథనం ప్రకారం జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారికి సమీపంలోని బటెంగో వద్ద ఈ ఘటన జరిగింది. అమర్ నాథుడిని దర్శించుకుని సోనమార్గ్ గుండా 70 మందికి పైగా యాత్రికులు బస్సులో తిరిగి వస్తుండగా ముష్కరులు దాడి చేశారు. యాత్రికులు ఎలాంటి రిజిస్ట్రేషన్, భద్రత లేకుండా వెళ్తుండటాన్ని గమనించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి.

Amarnath Yatra attack marks crucial turn in Kashmir militancy

దాడి జరిపిన ఉగ్రవాదులపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సినిమా సెలబ్రిటీలు సైతం ఈ దుశ్చర్యపై మండిపడుతున్నారు. హీరోయిన్ కాజల్ ఈ ఘటనపై స్పందిస్తూ, “ఇది పిరికిపందల చర్య. ఎంతో బాధను, కోపాన్ని కలిగిస్తోంది. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా” అంటూ ట్వీట్ చేసింది. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. చనిపోయినవారిని, బాధితులను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని అన్నాడు. ఉగ్రవాదులు మరో నీచానికి ఒడిగట్టారని అన్నాడు. రితీష్ దేశ్ ముఖ్ స్పందిస్తూ, దమ్ముంటే ప్రత్యక్ష యుద్ధానికి రావాలని ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ ట్వీట్ చేశాడు. అమాయకుల ప్రాణాలను తీయడం సిగ్గుమాలిన చర్య అని అన్నాడు.

Amarnath Yatra attack marks crucial turn in Kashmir militancy

అయితే గాయపడ్డవారిని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ పరామర్శించారు. అనంత్ నాగ్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నవారితో ఆమె మాట్లాడారు. `మీరు మా రాష్ట్రానికి వస్తే మేం ఏం చేశామో చూశారా?` అని ఆమె ఆవేదన భరిత హృదయంతో మాట్లాడారు. `మీ నుంచి నేను క్షమాపణలు కోరుతున్నాను` అని ఆమె బాధితులకు దండాలు పెడుతూ వేడుకున్నారు. పవిత్ర అమర్ నాథ్ యాత్ర సందర్భంగా ఉగ్రదాడిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

- Advertisement -